loading

0%

దూదేకుల కేర్ ఫోర్స్

చిన్న ప్రయత్నం పెద్ద మార్పుకు నాంది !

20 లక్షల మంది దూదేకుల అభివృద్ధి లక్ష్యంగా , వారి స్థితిగతుల , సామజిక ఉన్నతే ధ్యేయంగా ఏర్పడిన స్వచ్చంద సంస్థ దూదేకుల కేర్ ఫోర్స్ .

img
📢 దూదేకుల సమాజ బంధువులారా... ఒక ఆత్మపరిశీలన!... 📢 డీసీఎఫ్ వ్యవస్థాపకులు 'హన్ను భాయ్' గారికి జన్మదిన శుభాకాంక్షలు🎂🎉✨... 📢 బీసీ-ఈ జీఓపై క్లారిటీ ఇవ్వాలి: "దూదేకుల కేర్ ఫోర్స్" (DCF) డిమాండ్! ✊🔥... 🚨 మన పిల్లల ప్రతిభకు దేశ అత్యున్నత గుర్తింపు! 🚨...
image
DCF గురించి

దూదేకుల కేర్ ఫోర్స్ , ఇది రాజకీయ , కుల పోరాట సంఘం కాదనే విషయాన్నీ అందరికి తెలియచేయాలని ముందుగా మేము నిర్ణయించుకున్నాం. అలాగని దూదేకుల జాతికి ఎటువంటి అవమానం , అన్యాయం జరిగిన కూడా డీసీఎఫ్ ఉదాసీనతని వహించదని కూడా సుస్పష్టంగా తెలియచేస్తున్నాము .

డీసీఎఫ్ ఆశయాల్లో మొట్టమొదటిది, స్వయంప్రతిపత్తి . ఏ ఒక్కరు కూడా ప్రభుత్వపథకాలపై , ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా అన్ని కుటుంబాలను సంపాదనా మార్గాన్ని చేపట్టేలా చేయటం. ఈ ఆశయాన్ని చేరుకోవటానికి ప్రతిఒక్కరి సహకారం అవసరంగా డీసీఎఫ్ భావిస్తుంది. దీనిలో భాగంగానే డీసీఎఫ్ బిజినెస్ సర్కిల్ ని ఏర్పాటుచేసి , డీసీఫ్ మినీ మార్ట్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టటం జరిగింది.